Header Banner

రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్! 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే... రిలేషన్ షిప్ లో..!

  Fri Apr 11, 2025 16:35        Cinemas

హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె దాదాపు 20 ఏళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి టాప్ హీరోలతో నటించి అగ్ర కథానాయికగా నిలిచింది. అయితే, కొత్త తరం హీరోయిన్‌ల రాకతో త్రిష క్రేజ్ కొంత తగ్గిపోయింది. కానీ ఇటీవల మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది. తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలతో పాటు, విజయ్ - లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లియో'లో నటించి మంచి గుర్తింపు పొందింది.

 

ఇది కూడా చదవండి:  రూ.వెయ్యి కోట్ల స్కామ్‌లో సోనూసూద్? నిజంగా నమ్మలేకపోతున్నాం!

 

ప్రస్తుతం చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తుండగా, సూర్య తాజా చిత్రంలో కూడా త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆమె అందం, నటనతో 41 ఏళ్ల వయస్సులోనూ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ నేపథ్యంలో త్రిష తాజాగా తన సోషల్ మీడియాలో ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె “విషపూరితమైన వ్యక్తులతో కూడిన సమాజంలో జీవించడం, నిద్రపోవడం ఎలా సాధ్యం అవుతుందో అర్థం కావడం లేదు. ఇతరుల గురించి అసత్య రూమర్లను పుట్టించి, అసంబద్ధమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం భయంకరంగా ఉంది. ఇది పిరికితనానికి నిదర్శనం. దేవుడు అందరినీ ఆశీర్వదించాలి” అంటూ వ్యాఖ్యానించింది. దీనికి సాడ్ ఎమోజీని కూడా జత చేసింది. ఈ పోస్ట్ ఎవరికంటే ఉద్దేశించినదో స్పష్టంగా తెలియకపోయినా, సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశమైంది.

 

ఇక త్రిష వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, గతంలో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నా, ఆ పెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లి ఆ తర్వాత ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంది. కాగా, ఇటీవల త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ మధ్య సంబంధం ఉందంటూ పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, విజయ్ బర్త్‌డేకు త్రిష చేసిన విషెస్, ‘లియో’ సినిమాలో ఆమె చేసిన ఐటం సాంగ్, వీరిద్దరూ కలిసి ఒక స్పెషల్ ఫ్లైయిట్‌లో ప్రయాణించి ఓ పెళ్లికి హాజరైనట్లు వచ్చిన వార్తలు వీరి రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలకు తావిచ్చాయి. అయితే, ఈ రూమర్లపై త్రిష గానీ, విజయ్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #TrishaKrishnan #TrishaIsBack #TrishaInLeo #TrishaChiranjeevi #TrishaVijay #SouthQueenTrisha